అవార్డులకు ఎంపికపై చర్చ
logo
Published : 18/06/2021 03:51 IST

అవార్డులకు ఎంపికపై చర్చ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖులకు ఇచ్చే అవార్డులపై మంత్రులు గురువారం చర్చించారు. గవర్నర్‌ బంగళాలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌లు గురువారం సమావేశమయ్యారు. నగరానికి చెందిన 30 మంది ప్రముఖుల విషయమై సమీక్షలో చర్చ జరిగింది. వీరి నుంచి 8 మందిని ఎంపిక చేసి, వారిలో ఎవరెవరికి వైఎస్‌ పేరిట లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవ్వాలనే అంశంపై మంత్రులు చర్చించారు. విద్యాధికులతో పాటు వివిధ సంస్థలు, కళాకారులకు చెందిన వారు తుది జాబితాలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని