తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు అండగా ఉంటాం
logo
Published : 18/06/2021 03:51 IST

తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు అండగా ఉంటాం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : జిల్లాలో కొవిడ్‌తో తల్లిదండ్రులనుగానీ, తల్లిలేదా తండ్రిని కోల్పోయిన బాలలకు మహిళా శిశు సంక్షేమశాఖ అండగా ఉంటుందని జిల్లా బాలల సంక్షేమాధికారి ఎ.సత్యనారాయణ భరోసా కల్పించారు. తల్లిదండ్రులు మరణించిన అనాథ బాలలతో పాటు తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలల గృహాలకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. వారి బాగోగులు చూస్తున్న సంరక్షకులతో ఆయన మాట్లాడారు. బాలల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు. ఐసీపీఎస్‌ కౌన్సిలర్‌ సత్యనారాయణ, ఛైల్డ్‌లైన్‌ సిబ్బంది జేసుదాసు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని