అక్కడ ఆరెపు.. ఇక్కడ తమరాన
eenadu telugu news
Published : 31/07/2021 03:01 IST

అక్కడ ఆరెపు.. ఇక్కడ తమరాన

రెండో వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం
గుప్తాకి ధ్రువపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబు,ఆర్‌డీఓ సీతారామారావు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: మున్సిపాల్టీ రెండో వైస్‌ఛైర్మన్‌గా 13వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆరెపు నాగ త్రినాథ ఈశ్వరరావు గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు అందరి అంగీకారం మేరకు గుప్తా పేరును ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు) ముందే ఖరారు చేశారు. శుక్రవారం పాలకమండలి సమావేశంలో గుప్తా పేరును కౌన్సిలర్‌ ఆడారి పార్వతి ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్‌ కర్రి లక్ష్మి బలపరిచారు. దీంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్‌డీఓ సీతారామారావు ఎమ్మెల్యే కన్నబాబుతో కలిసి గుప్తాకు ధ్రువపత్రాన్ని అందించారు. అనంతరం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారిని అడగకుండానే పదవులు వరిస్తాయన్నారు. అంతా కలసి మున్సిపాలిటీని ఆదర్శంగా నడిపించాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి, వైస్‌ ఛైర్మన్‌ బెజవాడ నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమారవర్మ, వైకాపా నాయకులు బోదెపు గోవింద్‌, బొద్దపు ఎర్రయ్యదొర, ఆడారి శ్రీధర్‌, నేతి సురేష్‌, ఉప్పులూరి కిరణ్‌కుమార్‌, దాసరి కుమార్‌, కర్రి శివ, దూది నర్సింహమూర్తి, గంధం శివ, కట్టమూరి పరమేశ్వరరావు పాల్గొన్నారు.


విజయానందంలో అప్పలనాయుడు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: స్థానిక పురపాలిక రెండో వైస్‌ ఛైర్మన్‌గా తమరాన అప్పలనాయుడు ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఈ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రిసైడింగ్‌ అధికారి హోదాలో హాజరైన ఆర్డీవో ఎస్‌.డి. అనిత ముందుగా సమావేశానికి హాజరైన కౌన్సిలర్ల సంఖ్యను పరిశీలించారు. తెదేపా కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, ఇతర వైకాపా కౌన్సిలర్లు ఇందులో పాల్గొన్నారు. తమరాన అప్పలనాయుడు పేరును కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ ప్రతిపాదించగా మాకిరెడ్డి బుల్లిదొర బలపర్చారు. ఇతనికి మద్దతుగా మొత్తం 17 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తడంతో తమరాన ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఛైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని