వి.ఎం.ఆర్‌.డి.ఎ. కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Updated : 31/07/2021 06:16 IST

వి.ఎం.ఆర్‌.డి.ఎ. కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

వెంకటరమణారెడ్డి

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వి.ఎం.ఆర్‌.డి.ఎ) నూతన కమిష నర్‌గా కె.వెంకటరమణారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ వి.ఎం.ఆర్‌.డి.ఎ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తిచేయడానికి కృషిచేస్తానన్నారు.

-న్యూస్‌టుడే, పెదవాల్తేరు


అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు

వి.ఎం.ఆర్‌.డి.ఎ. రూపొందించిన బృహత్తర ప్రణాళిక-2041 ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 31తో గడువు ముగియనుండగా.. మరో వారం రోజులు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఈనెల 16 వరకే గడువు ఉండగా.. 31 వరకు పొడిగించారు. మరికొంతకాలం పెంచాలని పలు వర్గాల నుంచి వినతులు రావడంతో ఆగస్టు 7 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశమిచ్చారు.

-న్యూస్‌టుడే, పెదవాల్తేరు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని