వారిని ఇక్కడే కొనసాగించాలంట!!
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

వారిని ఇక్కడే కొనసాగించాలంట!!

విస్మయపరుస్తున్న వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారుల నిర్ణయం

ఈనాడు, విశాఖపట్నం: వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగవర్గాల్లో చర్చకు దారితీశాయి. వీఎంఆర్‌డీఏలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఓ ఈఈ స్థాయి అధికారి పదవీకాలం అయిదేళ్లు ఇక్కడ పూర్తయింది. మళ్లీ ఆయన్ను కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం మాతృసంస్థ నుంచి ఇతర శాఖకు డిప్యుటేషన్‌ మీద వెళ్లిన వారు అయిదేళ్లకు మించి పనిచేయకూడదు. కొందరిని అయిదేళ్ల తరువాత కూడా కొనసాగించాలని గతంలో లేఖలు రాయగా ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. అయినా అందుకు భిన్నంగా మళ్లీ అడుగులు పడటం గమనార్హం. కొద్ది రోజుల కిందట వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించి వాటిని పూర్తి చేయాలనే కారణాన్ని చూపుతున్నట్లు సమాచారం. ● మరో అధికారి ఉప సంచాలకుల హోదాలో డిప్యుటేషన్‌పై వీఎంఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. త్వరలో పదోన్నతి రానుంది. పదోన్నతి వస్తే నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సొంత శాఖకు వెళ్లాలి. పదోన్నతి తరువాతా ఇక్కడే కొనసాగించేలా నిరభ్యంతర పత్రంపై ముందే సంతకం చేయడం గమనార్హం. కొద్ది రోజుల కిందటే ఇదే అధికారి ఇక్కడే తనను ఉంచాలని ఉన్నతాధికారులను కోరగా అప్పట్లో కుదరదనే సమాధానం వచ్చింది. అంతలోనే మళ్లీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ హడావుడి నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని