వాహనదారులపై కేసులు
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

వాహనదారులపై కేసులు

మాధవధార, న్యూస్‌టుడే: రోడ్డు భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రవాణా, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందం ఆధ్వర్యంలో కేసులు నమోదు చేస్తున్నామని డీటీసీ జి.సి.రాజారత్నం తెలియజేశారు. ఈ నెల 19 నుంచి 30 వరకు మొత్తం 672 కేసులను నమోదు చేశామన్నారు. ఇందులో శిరస్త్రాణం ధరించనివి 514, నెంబర్‌ ప్లేట్‌ లేనివి 37, లైసెన్సులు లేనివి 25, సీట్‌ బెల్ట్‌ ధరించనివి 27, ఆటోలో అధిక ప్రయాణికులను ఎక్కించుకొన్నవి 18, తప్పుడు మార్గంలో ప్రయాణించినవి 18, ట్రిపుల్‌ రైడింగ్‌ 17, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ 9, ప్రమాదకర డ్రైవింగ్‌ 5, తప్పుడు రిజిస్ట్రేషన్‌వి 2 కేసులు నమోదు చేసినట్లుగా ఆయన తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని