మత్స్యకారుల సమస్యలపై గవర్నర్‌కు వినతి
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

మత్స్యకారుల సమస్యలపై గవర్నర్‌కు వినతి

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన డాక్టర్‌ మూగి శ్రీనివాసరావు, ఒడిశా హైకోర్టు
స్టాండింగ్‌ కౌన్సిల్‌ జీవన్‌ కుమార్‌ సాహో

తాటిచెట్లపాలెం, జ్ఞానాపురం, న్యూస్‌టుడే : రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిషెర్మెన్‌ విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ మూగి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మత్స్యకారుల జీవన స్థితిగతులను వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మత్స్యకారులను షెడ్యూల్డ్‌ ట్రైబ్‌గా గుర్తించారని, రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయాలన్నారు. ఇందువల్ల సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్న మత్స్యకారులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఒడిశా హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ జీవన్‌ కుమార్‌ సాహో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని