ఇంజినీరింగ్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

ఇంజినీరింగ్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఏయూ వీసీ సమక్షంలో కేక్‌ కట్‌చేస్తున్న విద్యార్థిని

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఇవి విద్యార్థులకు సత్వర, సమర్థ సేవలు అందంచే దిశగా నిలుస్తాయని ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి అన్నారు. ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సర మొదటి సెమిస్టర్‌ ఫలితాలను కేవలం ఐదు రోజుల్లో విడుదల చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డిని కలుసుకొని కేక్‌ కోసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, పీజీ పరీక్షల డీన్‌ ఆచార్య జి.వి.రవీంధ్రనాథ్‌బాబు, కంప్యూటర్‌ సెంటర్‌ సంచాలకులు ఆచార్య కె.రమాసుథ, పి.శ్రీనివాసకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని