సహృదయ మూర్తి రావిశాస్త్రి
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

సహృదయ మూర్తి రావిశాస్త్రి

డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు పురస్కారం అందిస్తున్న దృశ్యం

సీతంపేట, న్యూస్‌టుడే : సామాజిక సంవేదనలను సునిశితం చేసిన సహృదయమూర్తి రావిశాస్త్రి అని పలువురు వక్తలు కొనియాడారు. విశాఖ రసజ్ఞ వేదిక, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి సందర్భంగా సాహితీ పురస్కార సభను ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. సభాధ్యక్షులు, విశాఖ రసజ్ఞవేదిక వ్యవస్థాపకులు గండికోట రఘురామారావు మాట్లాడుతూ కథ, నవల, నాటకం, ప్రక్రియ ఏదైనా రావిశాస్త్రి కలం దాన్ని సజీవ శిల్పంగా మలిచిందని పేర్కొన్నారు. డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు 2020 సంవత్సరానికిగాను రావిశాస్త్రి పురస్కారం అందించగా డి.కామేశ్వరి దేవి తరపున ఆమె బంధువులకు 2021 సంవత్సరానికి పురస్కారం అందించారు. డాక్టర్‌ డి.వి.సూర్యారావు, డాక్టర్‌ రాచకొండ నృసింహశర్మ, రాచకొండ ఉమాకుమార శాస్త్రి తదితరలు పాల్గొని ప్రసంగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని