హుద్‌హుద్‌ గృహాల నిర్మాణంపై ఆరా
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

హుద్‌హుద్‌ గృహాల నిర్మాణంపై ఆరా


వివరాలు తెలుసుకుంటున్న కలెక్టరు మల్లికార్జున

కొమ్మాది, న్యూస్‌టుడే: కొమ్మాది శివారు ప్రాంతంలో సర్వే సంఖ్య 83లో హుద్‌హుద్‌ బాధితుల కోసం 6.74 ఎకరాల్లో 19 బ్లాకుల్లో నిర్మిస్తున్న 608 గృహాల సముదాయాన్ని అధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. రూ.11.60 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఇళ్లు చెరువులో నిర్మించారా? చెరువును పూడ్చి కట్టారా? అక్కడ ఆయకట్టు ఉందా? దీనివల్ల వ్యవసాయ భూములకు ఇబ్బందులున్నాయా? పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లింది తదితర వాటిపై వివరాలు సేకరించారు. ఈ నిర్మాణాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు అందిన ఫిర్యాదు మేరకు కేంద్ర బృందం, జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతాన్ని పరిశీలించి పై అంశాలపై ఆరా తీసింది. ఈ గృహాల నిర్మాణానికి అన్ని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా లేదా అని తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాన కమిషనర్‌ భూ పరిపాలన కార్యాలయ కార్యదర్శి చక్రవర్తి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, అటవీ పర్యావరణ శాస్త్రవేత్త సురేష్‌బాబు గృహనిర్మాణశాఖ అధికారులతో చర్చించారు. నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు అందించనున్నామని బృంద ప్రతినిధులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని