విజయవంతంగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలు
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

విజయవంతంగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలు


వివరాలు తెలియజేస్తున్న డాక్టర్‌ షమీ

 

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: ఆరిలోవ హెల్త్‌సిటీలోని అపోలో ఆసుపత్రిలో రోబోటిక్‌ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ షమీ తెలిపారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుభవం కలిగిన వైద్య బృందం కిడ్నీ, గుండె, గర్భసంచిలో ఏర్పడిన కణితులను ఎలాంటి కోత, నొప్పి లేకుండా శస్త్రచికిత్సలు చేసి తొలగిస్తున్నారన్నారు. స్త్రీ విభాగ నిపుణురాలు డాక్టర్‌ కిరణ్మయి గర్భసంచిలో కణితులను ఎలా తొలగించారో వీడియో ద్వారా ప్రదర్శించారు. రోబో చేతులనుపయోగించి ఇప్పటివరకు 10 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు వైద్యులు నాయుడు, కార్తీక్‌, అచ్యుత్‌, హేమంత్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని