సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలకు ఏర్పాట్లు
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలకు ఏర్పాట్లు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంలోని 32 కేంద్రాల్లో సివిల్స్‌ ప్రాథమిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. యూసీఎస్పీ ఆధ్వర్యంలో అక్టోబరు 10న ఈ పరీక్ష జరగనుందన్నారు. దిల్లీ నుంచి శుక్రవారం సాయంత్రం యూసీఎస్పీ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్‌ మల్లికార్జున, డీఆర్వో శ్రీనివాసమూర్తిలతో చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 12,166 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. కేంద్రాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. యూసీఎస్పీ అధికారులు మాట్లాడుతూ పేపర్‌-1 ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి 4.30గంటల వరకు జరుగుతుందన్నారు. నిర్దేశిత సమయానికి ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని