మహిళల వన్డే క్రికెట్‌ విజేత ‘విశాఖ’
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

మహిళల వన్డే క్రికెట్‌ విజేత ‘విశాఖ’

డెంకాడ, న్యూస్‌టుడే: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర జిల్లాల నార్త్‌జోన్‌ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. మూడు రోజుల టోర్నీలో విశాఖ విజేతగా నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లో పాయింట్ల ఆధారంగా విశాఖ జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. శుక్రవారం విజయనగరం జిల్లా చింతలవలస వద్ద ఉన్న ఎంవీజీఆర్‌ కళాశాల మైదానంలో విశాఖపట్నం- తూర్పుగోదావరి మధ్య మ్యాచ్‌ జరిగింది. విశాఖ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన తూర్పుగోదావరి జట్టు 42.4 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్‌ అయింది. విశాఖ జట్టు బౌలర్‌ శ్రీస్తిశేఖర్‌ 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన విశాఖ 23 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. సీహెచ్‌ లహరి 36, వి.పుష్ప 30 పరుగులు సాధించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని