డీఈఓగా చంద్రకళ?
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

డీఈఓగా చంద్రకళ?

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈఓ) ఎల్‌.చంద్రకళను నియమించినట్లు తెలిసింది. ప్రస్తుత డీఈఓ బి.లింగేశ్వరరెడ్డికి కమిషనరేట్‌ కార్యాలయంలోని మోడల్‌ స్కూల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ అయినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. లింగేశ్వరరెడ్డి జిల్లాలో ఉప విద్యాశాఖాధికారిగా, డీఈఓగా సుదీర్ఘకాలం పనిచేసి తనదైన ముద్రవేశారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో ఈయనకు త్రుటిలో అవకాశం తప్పింది. తాజాగా బదిలీపై కమిషనరేట్‌ కార్యాలయానికి వెళుతున్నారు. ఈయన స్థానంలో కృష్ణా జిల్లాలో ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసి ఇటీవల పదోన్నతి పొందిన చంద్రకళ జిల్లాకు వస్తున్నారు. ఈమె రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని