రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగానే..
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగానే..

ఉమ్మడి సర్వీసుపై విద్యాశాఖ మంత్రికి వినతి

విమానాశ్రయంలో విద్యాశాఖ మంత్రి సురేష్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఉమ్మడి సర్వీస్‌ నిబంధనల సమస్యను పరిష్కరించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇమంది పైడిరాజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు విన్నవించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శనివారం జరిగే రాష్ట్ర ఉన్నత విద్యా సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంత్రి నగరానికి చేరుకున్నారు. విమానశ్రయంలో ప్రాంతీయ సంచాలకులు జ్యోతికుమారి, డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌, ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైడిరాజు మంత్రిని కలిసి ఉమ్మడి సర్వీసు నిబంధనల సమస్యను 20 ఏళ్లుగా అపరిష్కృతంగా వదిలేశారని గుర్తుచేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ దీనిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యపై శనివారం జరగనున్న సమీక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కేంద్ర విశ్వవిద్యాలయాల సంచాలకులు హాజరవ్వనున్నట్లు ఏయూ అధికార వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని