సీఐడీకి యాక్సిస్‌ బ్యాంకు కేసు?
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

సీఐడీకి యాక్సిస్‌ బ్యాంకు కేసు?

చోడవరం పోలీస్‌స్టేషన్‌ నుంచి వస్తున్న బ్యాంకు క్లస్టర్‌ హెడ్‌ కందుల నీలకంఠగుప్తా, మేనేజర్‌ అరుణ్‌కుమార్‌

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: చోడవరం యాక్సిస్‌ బ్యాంకు నిధుల స్వాహా కేసును సీఐడీకి అప్పగించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ ఆర్థిక నేరం కావడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు చోడవరం పోలీసుస్టేషన్‌ అధికారులు ఓ నివేదికను సిద్ధం చేసి  ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. దీనిపై తీసుకునే తుది నిర్ణయం మేరకు దర్యాప్తు ఎవరు చేపడతారనేది తేలుతుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ విశాఖ క్లస్టర్‌ హెడ్‌ కందుల నీలకంఠగుప్తా బృందం చోడవరం శాఖలో రికార్డులు, లావాదేవీలు పరిశీలించి మొత్తం రూ. 1,18,37,965  స్వాహా అయిందని గుర్తించిన విషయం తెలిసిందే! దీనికి మహిళా ఆపరేషన్స్‌ మేనేజర్‌ రమాలావణ్యతో పాటు బ్యాంక్‌ మేనేజర్‌ ఎం.పుష్పరాజ్‌ బాధ్యులని గుర్తించి చోడవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. బ్యాంక్‌ మేనేజర్‌ పుష్పరాజ్‌తో పాటు మహిళా ఆపరేషన్స్‌ మేనేజర్‌ రమాలావణ్య, మరో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. చోడవరం శాఖకు కొత్త మేనేజర్‌గా అరుణ్‌కుమార్‌ను నియమించారు. కొత్త మేనేజర్‌తోపాటు క్లస్టర్‌ హెడ్‌ నీలకంఠగుప్తా చోడవరం ఎస్సై విభీషణరావును శుక్రవారం స్టేషన్‌లో కలిసి స్వాహా వ్యవహారంపై కొద్దిసేపు చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని