783 కిలోల గంజాయి పట్టివేత
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

783 కిలోల గంజాయి పట్టివేత

సబ్బవరం, నూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న 783 కిలోల గంజాయిని శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. దీని విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందన్నారు. వివరాలను సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సబ్బవరం పాతరోడ్డు నుంచి గుల్లేపల్లి వెళ్లే రహదారిలో అంతకాపల్లి కూడలి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యాన్‌ను ముందు, వెనుక ద్విచక్రవాహనాలతో ముగ్గురు వ్యక్తులు అనుసరించడంతో అనుమానించారన్నారు. ఆ వ్యాన్‌ను తనిఖీ చేయగా 783 కిలోల గంజాయి బయటపడిందన్నారు. వీటిని అనంతగిరి మండలం పినకోట గ్రామం నుంచి రేగం నాగరాజు(35) అక్రమంగా రవాణా చేస్తున్నాడని గుర్తించి అరెస్టు చేశామన్నారు. ద్విచక్రవాహనాల మీద వచ్చిన ముగ్గురు పరారయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై ఎల్‌.సురేశ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని