ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : ఉక్కు కర్మాగారంలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసుల వివరాల మేరకు సీఐఎస్‌ఎఫ్‌ కాలనీ 223-బిలో కుటుంబంతో కలిసి ఉంటున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన రాహుల్‌రాజ్‌ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య కూడా సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారని, వారికి మూడేళ్ల పాప ఉందన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని