32 కేంద్రాల్లో సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలు
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

32 కేంద్రాల్లో సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంలోని 32 కేంద్రాల్లో సివిల్స్‌ ప్రాథమిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. యూపీీఎస్పీ ఆధ్వర్యంలో అక్టోబరు 10న ఈ పరీక్ష జరగనుందన్నారు. దిల్లీ నుంచి శుక్రవారం సాయంత్రం యూపీఎస్పీ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్‌ మల్లికార్జున, డీఆర్వో శ్రీనివాసమూర్తిలతో చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 12,166 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. కేంద్రాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. యూపీఎస్పీ అధికారులు మాట్లాడుతూ పేపర్‌-1 ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి 4.30గంటల వరకు జరుగుతుందన్నారు. నిర్దేశిత సమయానికి ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని