ఇతర పనుల్లో సిబ్బంది.. రోగులకు తప్పని ఇబ్బంది
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

ఇతర పనుల్లో సిబ్బంది.. రోగులకు తప్పని ఇబ్బంది

స్ట్రెచర్స్‌పై సామగ్రిని తరలిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రిలో రోగులను తరలించాల్సిన నాలుగో తరగతి సిబ్బందికి ఇతర పనులు అప్పగిస్తున్నారు. దీంతో బంధువులే రోగులను స్ట్రెచ్చర్లపై ఉంచి తరలించాల్సి వస్తోంది. శుక్రవారం ఓపీ బ్లాక్‌లో ఉన్న మెడికల్‌ స్టోర్సు నుంచి వార్డులకు అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర సామగ్రిని స్ట్రెచ్చర్లపై నాలుగో తరగతి సిబ్బంది తరలించారు. ఇదే సమయంలో ఈఎండీ విభాగం నుంచి ఒక రోగిని ఆమె బంధువులు స్ట్రెచ్చర్‌పై వార్డుకు తీసుకెళ్లారు. నాలుగో తరగతి ఉద్యోగుల కోసం వేచి చూశామని, అందుబాటులో లేకపోవడంతో తామే మెడికల్‌ వార్డుకు తీసుకెళ్లవల్సి వచ్చిందని వాపోయారు. కేజీహెచ్‌లో పొరుగు సేవల కింద పని చేసే 56 మంది నాలుగో తరగతి ఉద్యోగులను ఇటీవల తొలగించారు. దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రస్తుతం 100 మంది, మూడు షిఫ్టుల్లో సేవలందించడం కష్టంగా మారింది. ఆయా ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపాయి.

ఈఎండీ విభాగం నుంచి వార్డుకు రోగిని తరలిస్తున్న సహాయకులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని