ఉక్కు పరిరక్షణకు 21న పాదయాత్ర :సీపీఐ
eenadu telugu news
Published : 18/09/2021 05:39 IST

ఉక్కు పరిరక్షణకు 21న పాదయాత్ర :సీపీఐ

ఉక్కుగనరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ఈనెల 21న సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర గోడపత్రికను శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. పారిశ్రామిక ప్రాంతం జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం వరకు జరిగే పాదయాత్రలో ఉక్కు కార్మికులు, గాజువాక నియోజకవర్గం ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనంతపురంలో ప్రారంభమైన పాదయాత్ర అదేరోజు కూర్మన్నపాలెంలో ముగుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎ.మసేనురావు, కె.ఎస్‌.ఎన్‌.రావు, డొక్కా నరసింగరావు, నరేష్‌కుమార్‌, రాజబాబు, తాండ్ర కనకరాజు, జి.రాజు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని