డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలకు నిధులు
eenadu telugu news
Published : 19/09/2021 03:24 IST

డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలకు నిధులు

కమిషనర్‌ భాస్కర్‌కు వివరిస్తున్న కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణాలకు అయిదు ఎకరాల స్థలం వెంటనే సేకరిస్తే నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర ఇంటర్‌ విద్యా కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. శనివారం ఆయన మాడుగుల కళాశాలను పరిశీలించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ స్థలాలు లేక, సొంత భవనాలు లేని కళాశాలలను గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. వెంటనే స్థలం సేకరిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. కళాశాల కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం సొంత భవనాలు లేక జూనియర్‌ కళాశాలలో వంతుల వారీగా కళాశాల నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయడు పర్యవేక్షణలో భవనాలకు స్థల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కళాశాల పక్కనే 1.5 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కళాశాలలో విద్యార్థులు చేరుతున్నారని ప్రిన్సిపల్‌ కుసుమకుమారి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని