‘సంస్కారం గురించి మీరా మాట్లాడేది?’
eenadu telugu news
Published : 19/09/2021 03:24 IST

‘సంస్కారం గురించి మీరా మాట్లాడేది?’

మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్వరరావు

అనకాపల్లి, న్యూస్‌టుడే: సంస్కారం గురించి మాట్లాడే హక్కు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. అనకాపల్లిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడును నడిరోడ్డుపై తుపాకీతో కాల్చాలని, బంగాళాఖాతంలో కలుపుదామని, చెప్పులతో కొట్టాలని పలు సభలలో జగన్‌ ఏ సంస్కారంతో మాట్లాడారని ప్రశ్నించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాటలు పౌరహక్కులను ప్రశ్నించే విధంగా ఉన్నాయి తప్పా, ఎవరిని కించపరిచేలా లేవని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న చంద్రబాబునాయుడు ఇంటిపై వైకాపా మూకలు దాడిచేయడం సిగ్గుచేటన్నారు. తెదేపా నాయకులు ధనాల విష్ణుచౌదరి, బొద్దపు ప్రసాదు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని