అక్షరాస్యతతో చట్టాలపై అవగాహన
eenadu telugu news
Published : 19/09/2021 03:24 IST

అక్షరాస్యతతో చట్టాలపై అవగాహన

జైలు ఆవరణలో మొక్కకు నీరు పోస్తున్న జడ్జి శాయికుమారి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలని స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శాయికుమారి సూచించారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. శనివారం ఎలమంచిలి సబ్‌జైలులో ఆమె అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖాళీ ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేయకూడదన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరూ అక్షరాస్యులు కావాలని, తద్వారా చట్టాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి జె.సుజిన్‌కుమార్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల ద్వారా సత్వర న్యాయం అందుతుందన్నారు. ఖైదీల్లో పరివర్తన రావాలని సూచించారు. అనంతరం న్యాయమూర్తులు సబ్‌జైలులో వసతులు పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే నిర్భయంగా చెప్పుకోవాలన్నారు. జైలు ఆవరణలో మొక్కలు నాటారు. జైలు సూపరింటెండెంట్‌ కనకరాజు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని