తొమ్మిది అడుగుల కొండచిలువ హతం
eenadu telugu news
Published : 19/09/2021 03:24 IST

తొమ్మిది అడుగుల కొండచిలువ హతం

కొండచిలువను చూపుతున్న రైతు

కోటవురట్ల, న్యూస్‌టుడే: తొమ్మిది అడుగుల కొండచిలువను రైతులు శనివారం హతమార్చారు. కోటవురట్లకు చెందిన రైతు తుమ్మలపల్లి ఆంజనేయులు రాట్నాలపాలెం గ్రామాన్ని ఆనుకొని జీడి, మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అందులో ఓ కొండచిలువ కోడిని మింగగా, మిగిలిన కోళ్లు అరుస్తుండటం సమీపంలోని రైతులు గమినించి అక్కడకు చేరుకున్నారు. కోడిని మింగిన కొండచిలువ కదల్లేని స్థితిలో ఉండగా, కర్రలతో దాన్ని హతమార్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని