ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

దీక్షా శిబిరం వద్ద కార్మిక నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్న
ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉక్కు పరిరక్షణ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ఆగదని ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కూర్మన్నపాలెం కూడలిలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. పరిశ్రమ అమ్మకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లేఖ రాశారని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తుచేశారు. అయినా కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోరాటానికి వైకాపా, వైఎస్సార్‌టీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, కె.బద్రీనాథ్‌, వై.మస్తానప్ప, వైటీ.దాస్‌, గంధం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలు 219వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యూఆర్‌ఎం, ఆర్‌ఎస్‌ అండ్‌ ఆర్‌ఎస్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని