వీసీలపై చర్యలకు డిమాండ్‌
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

వీసీలపై చర్యలకు డిమాండ్‌

నిరసన వ్యక్తం చేస్తున్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌, ఇతర సభ్యులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ, నాగార్జున వర్సిటీల వీసీలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ విద్యార్ధి విభాగం(టిఎన్‌ఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం గ్రీన్‌పార్కు హోటల్‌లో విద్యా శాఖమంత్రి సురేష్‌కు వినతిపత్రం అందజేసేందుకు ప్రణవ్‌గోపాల్‌ రావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు పలువురిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ ఆరేటి మహేష్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు సత్యనారాయణ, పెద్దిరెడ్డి, రతన్‌కాంత్‌, శివ, జోష్‌ యాదవ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని