ఫైబర్‌నెట్‌ సామర్థ్యం పెంచుతున్నాం...
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

ఫైబర్‌నెట్‌ సామర్థ్యం పెంచుతున్నాం...

ఛైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఫైబర్‌నెట్‌ ప్రస్తుత సామర్థ్యం సరిపోవటం లేదని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 2.80 కోట్లతో సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఎ.పి.ఎస్‌.ఎఫ్‌.ఎల్‌. ఛైర్మన్‌ డాక్టర్‌ పి.గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఏయూలోని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మరో 2 నెలల్లో నాణ్యమైన అంతర్జాలం, కేబుల్‌తో ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు. దీనివల్ల మరో 2 లక్షల కనెక్షన్లు పెంచవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణ జరుగుతుందన్నారు. ఫైబర్‌నెట్‌లో అవకతవకలు జరిగినప్పుడు అప్పటి క్యాబినెట్‌ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. వారి ఆదేశాలతో జరిగాయా? అనేది కూడా విచారణలో వెలుగులోకి వస్తాయన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని