నేటి నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

నేటి నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రెండో విడత రేషన్‌ సరకుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభమై, 30వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు బియ్యం అందజేస్తోందన్నారు. ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల చొప్పున ఇస్తారన్నారు. చౌకదుకాణాల్లో ఈపోస్‌ యంత్రాల సహాయంతో ఉదయం 7గంటల నుంచి పంపిణీ జరుగుతుందన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే కంట్రోలు రూమ్‌ నెంబరు 88866 71713ను సంప్రదించాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని