రైలులో మరిచిపోయిన బ్యాగు అప్పగింత
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

రైలులో మరిచిపోయిన బ్యాగు అప్పగింత

బ్యాగును బాధితులకు అందజేస్తున్న ఆర్పీఎఫ్‌ పోలీసులు

కూర్మన్నపాలెం (దువ్వాడ రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే : రైలు బోగీలో మరిచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను తిరిగి బాధితులకు అప్పగించిన ఘటన శనివారం మర్రిపాలెం రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. దువ్వాడ ఆర్పీఎఫ్‌ సీఐ ఆర్‌కే.రావు వివరాల మేరకు... భీమ్‌నాయక్‌ తన భార్యతో కలిసి గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో షిర్డీ-హౌరా స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-8 బోగీలో ఎక్కి విశాఖపట్నం దువ్వాడలో దిగారు. ఆ సమయంలో 15 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను పొరపాటున రైలులో మరిచిపోయారు. ఆ విషయాన్ని వెంటనే గుర్తించి స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న హెచ్‌సీ బి.నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి మర్రిపాలెం ఆర్పీఎఫ్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు సింహాచలం చేరుకునేలోగా సిబ్బంది బోగీలోకి వెళ్లి హ్యాండ్‌ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితులు మర్రిపాలెం స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు బ్యాగు అప్పగించారు. ఆర్పీఎఫ్‌ పోలీసుల అప్రమత్తతతోనే బ్యాగు దొరికిందని భీమ్‌నాయక్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని