నగరానికి శారదా పీఠాధిపతి రాక రేపు
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

నగరానికి శారదా పీఠాధిపతి రాక రేపు

రుషీకేశ్‌లో గంగానదికి హారతిస్తున్న స్వామీజీలు

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుషీకేశ్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు సోమవారం విశాఖ నగరానికి రానున్నట్లు పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 4 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మే 15న స్వామీజీలు వేద విద్యార్థులతో కలిసి చాతుర్మాస్య దీక్ష కోసం రుషీకేశ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. జులై 24న ప్రారంభించిన దీక్ష ఈ నెల 20తో ముగుస్తుంది. ఆ మేరకు దీక్షలో హిమాలయ ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆధ్యాత్మిక చింతన, బోధనలో గడిపారు. శారదా పీఠం ప్రచురించిన గ్రంథాలపై పరిశోధనలు సాగించారు. చినముషిడివాడలోని పీఠంలో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో స్వామీజీలు పాల్గొంటారని పీఠం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని