మేధోహక్కుల విధానం-2021 ఆవిష్కరణ
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

మేధోహక్కుల విధానం-2021 ఆవిష్కరణ

ఆవిష్కరణలో పాల్గొన్న ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘మేధోహక్కుల విధానం-2021’ని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. శనివారం ఏయూలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఉపయుక్తంగా మేధోహక్కుల విధానం తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, ఐఐపీఈ సంచాలకులు ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె. ప్రసాద్‌, ఐఐఎంవి సంచాలకులు ఆచార్య చంద్రశేఖర్‌, ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఐ.పి.ఆర్‌.చెయిర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని