కోల్‌కతాలో సైబర్‌ నేరం.. నిందితులు నర్సీపట్నంవాసులు!
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

కోల్‌కతాలో సైబర్‌ నేరం.. నిందితులు నర్సీపట్నంవాసులు!

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: పశ్చిమబంగా రాష్ట్రం కోల్‌కతా కేంద్రంగా జరిగిన ఓ సైబర్‌ నేరంలో నర్సీపట్నం పురపాలికలోని బలిఘట్టంతోపాటు గొలుగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పలువురి పాత్ర ఉందని గుర్తించిన అక్కడి సైబర్‌ క్రైం పోలీసులు నర్సీపట్నం వచ్చి విచారణ చేపట్టారు. శనివారం ఇద్దరు నిందితులను నర్సీపట్నం టౌన్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేరంలో బలిఘట్టానికి చెందిన ఓ గ్రామీణ వైద్యుడితోపాటు ఇద్దరు యువకులకు సంబంధం ఉందని సమాచారం. వీరితోపాటు అయ్యన్నపాలెం, అయ్యన్న కాలనీకి చెందిన ముగ్గురు, గొలుగొండ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరి పాత్రపై పశ్చిమబంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన నగదును అక్కడి వారు ఆన్‌లైన్‌ ద్వారా దారి మళ్లించారు. ఇక్కడి కొందరి బ్యాంకు ఖాతాలకు రూ.1823 చొప్పున పలుమార్లు నగదు జమ చేశారు. కొందరి ఖాతాల్లో వేల రూపాయల్లో, కొందరి ఖాతాల్లో రూ.లక్ష వరకు జమైంది. నిందితుల్లో కొందరు తమ ఖాతాలకు నేరుగా నగదు జమ చేయించుకోవడంతోపాటు తమకు తెలిసిన అనేకమంది ఖాతాల నంబర్లు వాడుకుని నగదు రప్పించుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని