డీజీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

డీజీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మాజీ మంత్రి బండారు డిమాండ్‌

 

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, జెడ్‌ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు నివాసంపై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో దాడి జరుగుతుంటే నిలువరించలేని స్థితిలో పోలీసు యంత్రాంగం ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. శనివారం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరోజు ముందే సామాజిక మాధ్యమాల్లో దాడి విషయం వెల్లడైనా పోలీసులు కళ్లు అప్పగించి కూర్చున్నారని దుయ్యబట్టారు. ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌ చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైకాపా నేతలు, తెదేపా నేతలను పలుమార్లు తిట్టారని, ఆ సమయంలో తాము ఇళ్ల ముట్టడికి వెళ్లామా అని ప్రశ్నించారు.

* బిల్లులు కట్టలేదని రాష్ట్రంలో 14 మున్సిపాల్టీలకు విద్యుత్తు కనెక్షన్‌ తీసేరాని, విశాఖ జీవీఎంసీలో గుత్తేదారులకు రూ.312కోట్లు బకాయిలున్నాయని, ఇలా రాష్ట్రంలో స్థానిక సంస్థలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయన్నారు. విశాఖలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయకుండా వదిలేసి, రూ.2కోట్ల ఖర్చుతో కుక్కల కోసం పార్కు పెడతామని చెప్పడం ఎంతవరకు సబబన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని