ఐదుగురు సచివాలయ సిబ్బందికి షోకాజ్‌
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

ఐదుగురు సచివాలయ సిబ్బందికి షోకాజ్‌


విద్యార్థినితో బ్లాక్‌ బోర్డుపై అక్షరాలు రాయిస్తున్న పీవో గోపాలకృష్ణ

జి.మాడుగుల, న్యూస్‌టుడే: సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హెచ్చరించారు. జి.మాడుగుల మండలం సింగర్భ, జి.మాడుగుల, కె.కోడాపల్లి సచివాలయాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల్లో సిబ్బంది హాజరు, కదలిక పట్టీలను పరిశీలించారు. కె.కోడాపల్లి సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి భారతి, వీఆర్వో అశోక్‌కుమార్‌, సర్వే అసిస్టెంట్‌ స్వామినాయుడు, పశుసంవర్థక సహాయకుడు సుబ్రహ్మణ్యం, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ వీర వెంకటేశ్వరరావుకు షోకాజ్‌ జారీ చేసి, ఒక రోజు జీతం నిలిపివేయాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. మరో 15 రోజుల్లో నిర్మాణ దశలో ఉన్న సచివాలయాలను పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇసుక కొరత ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జి.మాడుగుల మండలంలో 420 మందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, పట్టాలు రానివారికి త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు.

కందమామిడి హెచ్‌ఎం, మ్యాట్రిన్‌కు..

పాడేరు: డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు. డిజిటల్‌ తరగతుల పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పాడేరు మండలం బంగారుమెట్ట పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్‌ తరగతి గదిని పరిశీలించాక విద్యార్థులతో ముచ్చటించారు. బ్లాక్‌ బోర్డుపై విద్యార్థులతో అక్షరాలు రాయించారు. అంతకుముందు కందమామిడి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పీవో మెనూ అమలుతీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రధానోపాధ్యాయులు గంగబాయిని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించారు. ప్రధానోపాధ్యాయులు, మ్యాట్రిన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీడీ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని