మత్స్యగెడ్డ ఒడ్డున సినిమా చిత్రీకరణ
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

మత్స్యగెడ్డ ఒడ్డున సినిమా చిత్రీకరణ

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: సుజనకోట, పనసపుట్టు పంచాయతీల మధ్య గిద్దులపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డ ఒడ్డున షూటింగ్‌ సందడి నెలకొంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హనుమెన్‌’ సినిమాలో పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. జాంబిరెడ్డి హీరో తేజ్‌ సజ్జా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్‌ హీరోయిన్‌ అమృత అయ్యర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు. జబర్దస్త్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను, రోహిణి కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ జరుగుతుందని దర్శకుడు చెప్పారు. షూటింగ్‌ తిలకించేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని