ఎలమంచిలిలో భారీ వర్షం
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

ఎలమంచిలిలో భారీ వర్షం

ఎలమంచిలి తులసీనగర్‌లో నీట మునిగిన రోడ్లు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలో బుధవారం రాత్రి రికార్డు స్థాయిలో ఎనిమిది సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాత్రి 9 గంటల నుంచి 10 గంటలకు కుండపోతగా వర్షం కురిసింది. తులసీనగర్‌లో భూలోకమాంబ ఆలయం ప్రాంగణం పూర్తిగా నీటి మునిగింది. అయోధ్యపురి కాలనీ, అల్లూరి సీతారామరాజు కాలనీల్లో నీరు చేరింది. రాజీవ్‌ క్రీడామైదానం చెరువులా మారింది. గంట వ్యవదిలో ఇంత వర్షం కురవడం అందరినీ ఆశ్చర్య పరచింది. కాలువల్లో చెత్త అంతా రోడ్లుపైకి చేరింది. ఓరుగంటి వారి వీధి, జళాల వీధి, నీటితో నిండాయి. ఉరుములు మెరుపులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. నక్కపల్లిలో 54 మీల్లీ మీటర్లు, ఎస్‌.రాయవరంలో 26 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. పంటకాలువల్లో, పొలాల్లో పుష్కలంగా నీరు చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని