కల్యాణపులోవ కాలువల గండ్ల పూడ్చివేత
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

కల్యాణపులోవ కాలువల గండ్ల పూడ్చివేత


జెడ్‌.కొత్తపట్నం వద్ద కాలువ గండి పూడ్చివేత పనులు

రావికమతం, న్యూస్‌టుడే: కల్యాణపులోవ జలాశయం కాలువలకు పడిన గండ్ల పూడ్చివేత పనులు గురువారం చేపట్టారు. ఈ నెల అయిదున కురిసిన భారీ వర్షానికి జలాశయం కాలువలు, కొండ గెడ్డలు, పంట పొలాల నుంచి వర్షం నీరు ముంచెత్తడంతో ప్రధాన కాలువలో 4ఏ డివిజన్‌ డ్యాం దగ్గర, జెడ్‌.కొత్తపట్నంకు సమీపంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో నీరంతా వరి పొలాలపై పొంగి పొర్లడంతో ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఏఈ సత్యనారాయణ దొర పర్యవేక్షణలో దొండపూడి రైతులు ట్రాక్టర్లతో గ్రావెల్‌ తీసుకొచ్చి గండి పడిన ప్రదేశంలో పోశారు. శుక్రవారం ఇసుక బ్యాగ్‌లను పేర్పిస్తామని, నిధులు వచ్చిన వెంటనే శాశ్వత పనులు చేపడతామని ఏఈ తెలిపారు. దొండపూడికి చెందిన రైతులు శ్రమదానం చేసి కాలువలో పేరుకుపోయిన మట్టిని, పిచ్చి మొక్కలు తొలగించారు. మాజీ సర్పంచులు తాతబాబు, రమణబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని