విద్యార్థులు ఉద్యోగాలిచ్చేలా ఎదగాలి
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

విద్యార్థులు ఉద్యోగాలిచ్చేలా ఎదగాలి

అనకాపల్లి పట్టణం: విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ రఘురాం పేర్కొన్నారు. డైట్‌ కళాశాలలో గురువారం వ్యవస్థాపక అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ సామాన్య వ్యక్తుల నుంచి వ్యవస్థాపకులుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యువత ముందడుగు వేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. ఐఎస్‌టీఈ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఓఐఆర్‌ బోర్డు మేనేజర్‌ ఎన్‌ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలన్నారు. దీనికి కావాల్సిన సూచనలు, సలహాలకు కళాశాలల్లో నిర్వహిస్తున్న ఇటువంటి సదస్సులు దోహదపడతాయని పేర్కొన్నారు. డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నరసింహం, ఈఈఈ విభాగాతిపతి కృష్ణనాగ్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని