ఉప మేయర్ల కార్లకు అద్దె చెల్లిద్దాం
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

ఉప మేయర్ల కార్లకు అద్దె చెల్లిద్దాం

స్థాయీ సంఘ సమావేశ అజెండాలో ప్రతిపాదన

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించడానికి అజెండాను సిద్ధం చేశారు. మొత్తం 34 అంశాలపై సభ్యులు చర్చించి.. ఆమోదం పొందేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. స్థాయీ సంఘం సభ్యుల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అనువుగా ప్రతిపాదనలను పెట్టారు. పాలకవర్గం ఏర్పాటైన తరువాత మొదటిసారి అభివృద్ధి పనులకు అజెండాలో చోటు కల్పించారు.బకాయిలు చెల్లించిన వారి దుకాణాలు తెరిచే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఉప మేయరు వాడుతున్న కారుకు జీవీఎంసీ అద్దె చెల్లించే విషయాన్నీ చేర్చారు. గత మూడు నెలలుగా అద్దె కారు వినియోగిస్తుండటంతో రూ.2.07లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఉప మేయరు శ్రీధర్‌ తన సొంత కారును వినియోగిస్తుండగా, ఓ ట్రావెల్స్‌ నుంచి వాహనాన్ని తీసుకున్నట్లు అజెండాలో పొందుపరిచారు. ఉప మేయరుకు కారు మంజూరు చేస్తున్న విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకురావాల్సి ఉన్నా నేరుగా అద్దె కోసం ప్రతిపాదించారు. జీవీఎంసీలో ఇద్దరు ఉప మేయర్లున్నారు. వారికి ఏటా దాదాపు రూ.16లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

* అక్కయ్యపాలెంలోని షాదీఖానా, మాధవస్వామి కల్యాణ మండపాల అద్దె తగ్గించాలని ఫ్లోర్‌ లీడర్‌ బానాల శ్రీనివాసరావు, నెడ్‌క్యాఫ్‌ ఛైర్మన్‌ కేకే రాజు ప్రతిపాదించినట్లు అజెండాలో చేర్చారు.

* జీవీఎంసీ స్థాయీ సభ్యులుగా ఉన్న పది మందికి సంబంధించిన వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. రూ.50 లక్షల కంటే తక్కువ నిధులతో ప్రతిపాదనలు పెట్టి, ఆమోదించుకునేలా ప్రణాళికలు రూపొందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని