45 కరోనా కేసుల నమోదు
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

45 కరోనా కేసుల నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 45 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1,56,855కు చేరిందన్నారు. 49 మంది కోలుకున్నారని, వీరి సంఖ్య 1,54,816కు చేరిందన్నారు. భీమునిపట్నంకు చెందిన 70ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో వీరి సంఖ్య 1,085కు చేరిందన్నారు. ప్రస్తుతం 954 మంది ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని