రూ. 100 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్‌కు నివేదిక
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

రూ. 100 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్‌కు నివేదిక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ గ్రామీణ మండల పరిధిలోని కొమ్మాదిలో కలకలం రేపిన రూ.100కోట్ల భూ వ్యవహారంలో రెవెన్యూశాఖ పరంగా జరిగిన తప్పిదాలపై కేఆర్‌ఆర్‌సీసీ (కోనేరు రంగారావు సిఫార్సు కమిటీ) విభాగ ఉప కలెక్టర్‌ సిహెచ్‌.రంగయ్య తన విచారణను పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారించారు. కలెక్టర్‌ మల్లికార్జునకు గురువారం కలిసి నివేదికను అందజేశారు. విచారణ అధికారి సిఫార్సులు బహిర్గతం కాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని