యజమానికి ‘ఫ్యూజన్‌ ఫుడ్స్‌’ అప్పగింత
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

యజమానికి ‘ఫ్యూజన్‌ ఫుడ్స్‌’ అప్పగింత

ఈనాడు, విశాఖపట్నం : విశాఖ నగరం సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ)కు చెందిన స్థలంలో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ శ్రీకన్య కంఫర్ట్స్‌ హోటల్‌ను గత ఏడాది స్వాధీనం చేసుకున్న అధికారులు హైకోర్టు ఉత్తర్వులతో కదిలారు.వీఎంఆర్‌డీఏ అప్పీలును హైకోర్టు కొట్టి వేస్తూ వారం రోజుల్లో ఆ ప్రాంగణాన్ని యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌కు అప్పగించాలని ఇటీవల ఆదేశించడంతో... వీఎంఆర్‌డీఏ అధికారులు గురువారం ఆ ప్రక్రియను పూర్తి చేశారు. సెక్రటరీ రఘునాథరెడ్డి ప్రాంగణానికి చేరుకొని యజమానిని పిలిపించి అక్కడున్న నోటీసు బోర్డులను తొలగించారు. తాళాలు తీసి లోపలికి వెళ్లి పరిశీలించగా...విలువైన వస్తువులు కొన్ని చోరీకి గురైనట్లు తెలిసింది. సెంట్రల్‌ ఏసీ పరికరాలు, ఇతర యూనిట్ల వస్తువులు తస్కరణకు గురైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి సమాచారం, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రాంగణాన్ని ఖాళీ చేయించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. లీజు కొనసాగింపు విధానం సక్రమంగా లేదని అధికారులు పేర్కొనగా నిర్వాహకుడు హైకోర్టును ఆశ్రయించడంతో వీఎంఆర్‌డీఏ అధికారులు అనుసరించిన తీరును తప్పుపట్టింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని