న్యాయసేవలు వినియోగించుకోండి
eenadu telugu news
Updated : 24/09/2021 06:29 IST

న్యాయసేవలు వినియోగించుకోండి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: సమాజంలో అన్నివర్గాల వారికి పూర్తిస్థాయిలో ఉచితంగా లభించే న్యాయసేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ అన్నారు. ఆశ్రయ షెల్టర్‌ హోమ్‌లో జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ, ఏయూటీడీ సేవా సంస్థ, ఆధార్‌ కేంద్రం అధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథశర్మ మాట్లాడుతూ జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ ఉచితంగా న్యాయసేవలను, న్యాయసలహాలను, చట్టపరిజ్ఞానాన్ని అందిస్తోందని, అందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నిరాశ్రయులకు ఆధార్‌ కార్డులను పంపిణీచేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి కె.కె.వి.బులికృష్ణ, శ్రీనివాస్‌, శ్రీహరి, లోక్‌అదాలత్‌ సీనియర్‌ సభ్యులు లక్ష్మీరాంబాబు, తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని