నూతన డీఈవో బాధ్యతల స్వీకరణ రేపు
eenadu telugu news
Updated : 24/09/2021 06:13 IST

నూతన డీఈవో బాధ్యతల స్వీకరణ రేపు


కలెక్టర్‌ను కలిసిన నూతన డీఈవో చంద్రకళ

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : జిల్లా విద్యాశాఖాధికారిగా నూతనంగా నియమితులైన చంద్రకళ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారమే ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా మండలాధ్యక్షుల ఎన్నికలకు ప్రసుత్త డీఈవో లింగేశ్వరరెడ్డి రిటర్నింగ్‌ అధికారిగా ఉండడంతో మధ్యలో రిలీవ్‌ కావడానికి నిబంధనలు అడ్డువచ్చాయి. దీంతో బాధ్యతల స్వీకరణ శనివారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని