సింహగిరిపై ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి కృషి
eenadu telugu news
Updated : 24/09/2021 06:25 IST

సింహగిరిపై ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి కృషి


రాయల వారి విజయస్తూపం అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తున్న ఈవో సూర్యకళ

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రానికి వచ్చే భక్తులు ఇక్కడి విశేషాలను తెలుసుకుని మరపురాని అనుభూతికి లోనయ్యేలా ఆధ్యాత్మిక పర్యాటక వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని ఈవో ఎం.వి.సూర్యకళ అన్నారు. గురువారం ఆమె సింహగిరిపై పారిశుద్ధ్య నిర్వహణ మొదలుకొని సందర్శనీయ ప్రాంతాల వరకూ తీసుకోవాల్సిన అంశాలపై ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సింహగిరిపై మైక్రోవేవ్‌ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో కొండ శిఖరంపై ఉన్న శ్రీకృష్ణదేవరాయల విజయస్తూపాన్ని, గంగధారకు ఎగువ ప్రాంతంలో కొండపై కొలువైన వైకుంఠవాసుల మెట్టను అభివృద్ధి చేసి భక్తుల సందర్శనకు అనువుగా మార్చుతామన్నారు. కేశఖండనశాలలో శని, ఆదివారాలు రద్దీ సమయాల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి వేగంగా తలనీలాల సమర్పణ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింహగిరిపై దుకాణదారులు పారిశుద్ధ్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో సూర్యకళ హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని