రోడ్డున పడ్డ దివ్యాంగ బాలలు
eenadu telugu news
Updated : 24/09/2021 06:26 IST

రోడ్డున పడ్డ దివ్యాంగ బాలలు

రహదారిపైనే వంటా.. వార్పు
భోజనం చేస్తున్న దివ్యాంగ బాలలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : లీజు పూర్తయిందనే కారణంతో పెదవాల్తేరులోని హిడెన్‌స్ప్రౌట్స్‌ మానసిక దివ్యాంగ సంస్థను జీవీఎంసీ అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే 118 రోజులు గడిచినా ప్రత్యామ్నాయం చూపించలేదని గురువారం సంస్థ ఎదురుగా రోడ్డుపైనే దివ్యాంగ విద్యార్థులతో కలిసి బైఠాయించారు. అక్కడే ఆట.. పాట.. వంటా వార్పు నిర్వహించారు. సీజ్‌ చేసిన తర్వాత వేరే ప్రాంతంలో రెండు రోజుల్లో షెల్టర్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని.. 118 రోజులయినా ప్రత్యామ్నాయం చూపించలేదని సంస్థ నిర్వాహకుడు కండిపిల్లి శ్రీనివాసరావు వాపోయారు. చేసేది లేక రోడ్డుపైనే చదువుతో పాటు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూడు నెలలుగా చెప్పులు అరిగేలా జీవీఎంసీ కార్యాలయానికి తిరిగినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేశారే తప్ఫ. వసతి మాత్రం కల్పించలేదన్నారు. సంస్థ ఆవరణలో స్కూల్‌ బస్సులు, ఇతర ఎలక్ట్రానిక్‌ సామగ్రి పూర్తిగా పాడయ్యాయన్నారు. ఎక్కడా ప్రత్యామ్నాయం చూపకపోవడంతో విద్యార్థులు పలు శిక్షణలకు దూరమైపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దివ్యాంగుల కోసం సంస్థను ఆప్పగించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని