ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
eenadu telugu news
Updated : 24/09/2021 06:05 IST

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

జగదీష్‌బాబు (పాతచిత్రం)

గోపాలపట్నం, న్యూస్‌టుడే : ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 89వ వార్డు డీఏఆర్‌.నగర్‌కు చెందిన కాళ్ల జగదీష్‌బాబు(56) కారుడ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో ఏఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వివాహిత ఆత్మహత్య

సింధియా, న్యూస్‌టుడే : పారిశ్రామిక ప్రాంతంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాపురం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీహరిపురం దరి పవనపుత్రనగర్‌కు చెందిన వరలక్ష్మి (29) భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలం నుంచి పిల్లలు కలగకపోవడంతో మనస్థాపంతో మృతిచెందినట్లు భర్త పోలీసులకు తెలిపాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


సముద్రంలో వ్యక్తి గల్లంతు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లిపురానికి చెందిన సీదరాల నారాయణమూర్తి (44) గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆర్కే బీచ్‌కు వచ్చారు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా కెరటం ధాటికి లోనకు కొట్టుకుపోయారు. పోలీసులకు బాధితుడి భార్య దేవి ఫిర్యాదు చేశారు. సి.ఐ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోస్టుగార్డుకు సమాచారం ఇవ్వడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని