టీకా ప్రక్రియ శతశాతం పూర్తి చేయాలి
eenadu telugu news
Updated : 24/09/2021 06:08 IST

టీకా ప్రక్రియ శతశాతం పూర్తి చేయాలి

 అధికారులకు కలెక్టర్‌ ఆదేశం 
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అర్హులైన వారందరికీ రెండు విడతల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శతశాతం త్వరగా పూర్తి చేయాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కరోనా మూడోదశ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం యావత్తూ అప్రమత్తంగా, సిద్ధంగా ఉండాలన్నారు. జీవీఎంసీతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియను ప్రణాళిక యుతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని చోట్ల నోమాస్కు, నో ఎంట్రీ బోర్డులను పెట్టాలన్నారు. నర్సీపట్నం, అనకాపల్లిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నందున కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. ఖాళీలను భర్తీ చేయాలని, 104 సక్రమంగా పనిచేసే విధంగా చూడాలన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా నివారణకు మరింత పకడ్బందీగా చర్యలను చేపట్టాలన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.మైథిలి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.ఎస్‌ సూర్యనారాయణ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రకాశరావు, వివిధ ఆసుపత్రుల పర్యవేక్షక వైద్యాధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని