రూ.4.37 కోట్ల వైద్య పరికరాల అందజేత
eenadu telugu news
Updated : 24/09/2021 06:09 IST

రూ.4.37 కోట్ల వైద్య పరికరాల అందజేత


కలెక్టర్‌ సమక్షంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సామగ్రిని అందజేస్తున్న ఓఎన్జీసీ ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌: విశాఖపట్నానికి చెందిన ఇమ్మాన్యుయేల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సహకారంతో ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు రూ.4.37 కోట్ల విలువైన వైద్య సామగ్రిని గురువారం కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు అందజేశారు. 25 ఆటోమెటిక్‌ వెంటిలేటర్లు, 1,385 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో పాటు మూడు రకాల ఆక్సిజన్‌ సిలిండర్లను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పార్లమెంట్‌ సభ్యులు వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవి సమక్షంలో కలెక్టర్‌కు అందించారు. పెద్ద ఎత్తున వితరణ చేసిన ఓఎన్జీసీ ప్రతినిధులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జేసీ కీర్తి, ఓఎన్జీసీ ప్రతినిధులు కె.రాజేశ్‌, ఎ.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆరోగ్యశ్రీ చికిత్సలకు రూ.265 కోట్లు ఖర్చు

గురుద్వారా, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆయుష్మాన్‌ భారత్‌ దివస్‌ సందర్భంగా భారత్‌ మంథన్‌ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాజేశ్‌ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తిచేసుకుందన్నారు. మన రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ నోడల్‌ ఏజెన్సీ డాక్టర్‌ వై.ఎస్సార్‌ ఆరోగ్య శ్రీ అని అన్నారు. ఈ మూడేళ్లలో జరిగిన 1,21,290 చికిత్సలకు రూ. 265 కోట్ల వరకు ఖర్చు ఉంటుందని తెలిపారు. జిల్లాల్లో సుమారుగా 12 లక్షల పైబడి ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్నారని, 2438 రకాల వ్యాధులకు చికిత్సలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందిస్తున్న సేవలో కేజీహెచ్‌ ప్రథమ స్థానంలో ఉందని, 144 మంది ఆరోగ్యశ్రీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని